AP New Ration Card - ఆంధ్ర ప్రదేశ రాష్ట్ర ప్రజలకు GOOD NEWS : రాష్ట్ర ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న New Ration Card దరఖాస్తు కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
AP New Ration Card - ఆంధ్ర ప్రదేశ రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ : రాష్ట్ర ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న New Ration Card దరఖాస్తు కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
AP New Ration Card - ఆంధ్ర ప్రదేశ రాష్ట్ర ప్రజలకు GOOD NEWS : రాష్ట్ర ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న New Ration Card దరఖాస్తు కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోమారు ప్రజల
అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త రేషన్ కార్డుల మంజూరు, విభజన, కుటుంభ సభ్యుల
జోడింపు, చిరునామా మార్పు వంటి అంశాలతో అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర
పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రజా అవసర్థం ఈ అవకాశాన్ని
కల్పిస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసారు.
AP New Ration Card : ప్రజలకు ఊరట :
రాష్ట్రంలో రేషన్ కార్డుల ప్రక్రియ పై
మంత్రి ప్రకటన తో ప్రజల్లో ఊరట లభించింది. నూతనంగా వివాహాలు అయిన దంపతులలో వధువు
తన తల్లి దండ్రుల నుంచి అత్తవారి కార్డులో చేరటం, అలాగే నూతన దంపతులకు కొత్త
కార్డుకు దరఖాస్తు, రేషన్ కార్డుల వివరాల్లో
తప్పులు, చిరునామా మార్పులు వంటి అన్ని అంశాలు చక్కదిద్దుకునే వెసులుబాటు ప్రభుత్వ
ఈ నిర్ణయం వల్ల ప్రజలకు అందుబాటులోకి రానుంది.
· కొత్త రేషన్ కార్డు కోసం
· - కుటుంబ సభ్యుల చేర్పు కోసం
· - రేషన్ కార్డు విభజన కోసం
· - చిరునామా మార్పు కోసం
- వంటి సేవలపై ప్రజలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా దరఖాస్తు ఈ
నెల మే 12 తరువాత దరకాస్తు చేసుకోవచ్చు.
- ఆకర్షణీయంగా స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్
· - క్యూ ఆర్ కోడ్ తో జారీ.
· - గత 6 నెలల రేషన్ వివరాలు కార్డు పై క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి తెలుసుకోవచ్చు.
· - మన దేశంలో ఎక్కడైనా రేషన్ పొందే అవకాశం.
· - కుటుంబ సభ్యుల వివరాలు స్పష్టంగా కనిపించేలా డిజైన్.
మే 7వ తేదీ నుంచి దరకాస్తు ప్రక్రియ మొదలవనుంది.
మే 12 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా దరఖాస్తు
చేసుకోవచ్చు.
సంభందిత రెవిన్యూ అధికారుల వెరిఫికేషన్
పూర్తి కాగానే జూన్ నెలో రేషన్ కార్డుల మంజూరు
వుంటుంది. అలాగే వున్న రేషన్ కార్డుల స్తానంలో క్యూ ఆర్ కోడ్ కలిగిన రేషన్ కార్డు
రేషన్ లబ్దిదారులు పొందే అవకాసం వుంటుంది.
మీరు రేషన్ కార్డు కు సంబంధించి ఇంకా eKYC చేయలేదా..? అయితే ఇప్పటికైనా త్వరపడండి. eKYC చేయని వారు వెంటనే మీ సమీప రేషన్ డీలర్ సంప్రదించండి. EKYC పూర్తి చేయండి.
5 ఏళ్ళు దాటిన పిల్లలకు : ఆధార్ కార్డు నమోదు ప్రక్రియ సమయంలో ఐరిస్, వ్రేలిముద్రలు, ఫోటో సేకరణతో అధార్ మంజూరు కాబడుతుంది. 5 ఏళ్ల చిన్నారులకు వారి తల్లి లేదా తండ్రి సంరక్షకుల అతేంటికేషన్ తో బాల ఆధార్ మంజూరు చేయబడుతుంది. ఇలాంటి కార్డులు 5 ఏళ్ల వయస్సు పై బడిన పిల్లలకు వారి బయోమెట్రిక్ తో ఆధార్ సెంటర్ లో కార్డు అప్డేట్ చేపించాలి. ఆధర్ అప్డేట్ రసీదు పొందాక, అప్డేట్ విజయవంతమైనదో లేదో నిర్ణిత రోజుల్లో తనిఖీ చేపించుకోవాలి. అప్డేట్ విజయవంతం కాగానే పిల్లల eKYC రేషన్ కార్డులో విజయవంతంగా పూర్తి చేపించ వచ్చు.
రేషన్ కార్డులో కుటుంభ సభ్యుల చేర్పు గురించి :
- రేషన్ కార్డులో చిన్నపిల్లలు/ వారసులు అయితే వారి జన్మ దృవీకరణ భర్త్ సర్టిఫికేట్, అధార్ కార్డు తో రేషన్ కార్డులో కుటుంభ సభ్యల చేర్చు అంశం కింద దరకాస్తు చేయాలి.
- వివాహం అయిన వారికి ముఖ్యంగా వధువు తన అత్తవారి కార్డులో చేరాల్సి వుంటుంది. ఇందుకు సంబంధించి వధూవరుల వివాహ దృవీకరణ పత్రం, సంబందిత ఫోటోలు, వివాహ కార్డు, ఆధార్ కార్డులతో దరకాస్తు చేసుకోవచ్చు.
- తప్పులు సరిదిద్దుట, చిరునామా మార్పునకు సంభందిత దృవీకరణ పత్రాలు జత చేసి ధరకాస్తు చేయాలి.
సహాయ న్యూస్ బ్లాగ్ ను ఆదరిస్తున్న మీకు ధన్యవాదాలు.
మీ అమూల్యమైన అభిప్రాయాలను comment లలో దయచేసి
తెలపండి.
సహాయ న్యూస్ టెలిగ్రామ్ గ్రూప్లో చేరేందుకు ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.
https://t.me/+iJs5bCvLGOE5YmE1

కామెంట్‌లు